ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు ముందుకు వచ్చారు. హుస్నాబాద్ కు చెందిన కొమ్ముల లక్కీ కమల్ అనే విద్యార్థి పేద కుటుంబానికి చెందినప్పటికీ చదువులో ప్రతిభ కనబరిచాడు. 10వ తరగతిలో 9.7 GPA, ఇంటర్లో 970/1000 మార్కులు సాధించి, NEET-UG 2026లో 499/720 మార్కులతో AIR 91372, SC కేటగిరీలో 3730 ర్యాంక్ సాధించాడు. దీంతో Osmania Medical College లో MBBS చదివే అవకాశం లభించింది.
అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్య విద్యను కొనసాగించడం కష్టంగా మారడంతో విద్యార్థి తన పరిస్థితిని MASS (మాస్) సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్‌రావు స్పందించి, MASS సంస్థ ద్వారా రూ.20,000 ఆర్థిక సహాయం అందించారు. "ప్రతిభ ఉన్న విద్యార్థికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదు. ఒక విద్యార్థి భవిష్యత్తుకు చేయూతనివ్వడం సమాజం పట్ల మన బాధ్యత" అనే స్ఫూర్తితో ఆమె అందించిన సహాయం విద్యార్థి వైద్య విద్యా ప్రయాణానికి ప్రోత్సాహంగా నిలిచింది.
విద్యార్థి కొమ్ముల లక్కీ కమల్‌కు అందించిన ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.