హైదరాబాద్ (రైట్స్ మీడియా): శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో రాష్ట్రస్థాయి సమాచార హక్కు వారోత్సవాలు- 2026 కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అవార్డును అందుకున్నారు.
జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
సమాచార హక్కు చట్టం అమలులో జిల్లాకు లభించిన ఈ అవార్డు ప్రజాకేంద్రిత పాలన, పారదర్శకత, జవాబుదారితనాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని జిల్లా కలెక్టర్ చాహత్ పాయి అన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పారదర్శకమైన పరిపాలన కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ కు అధికారులు, పలువురు సిబ్బంది అభినందనలు తెలిపారు.
నిబద్ధతతో PIOలు, అప్పీలేట్ అథారిటీలు..
పనిచేయడం వల్లనే హనుమకొండ జిల్లా కి ఈ అవార్డు వచ్చిందని... ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్క శాఖ అధికారులకు ఈ సందర్బంగా కలెక్టర్ అభినందనలు తెలిపారు