కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తైన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఘనంగా విజయోత్సవ సంబురాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. పీసీసీ,డీసీసీ,హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాలతో పట్టణ, మండల ప్రధాన కూడళ్లలో భారీర్యాలీ నిర్వహించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలన అనంతరం తెలంగాణ ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రతివర్గానికి న్యాయం చేస్తున్నామని, పదేళ్లు అధికారంలో బీఆర్ఎస్ చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరిన్ని సంక్షేమ పథకాలను జనాలకు అందజేసిందని అన్నారు.
ఘనంగా 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలు...
హుజురాబాద్ లో..
1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీలు హుజురాబాద్ లో ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి 500 మందితో అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చి,కేక్ కట్ చేశారు. అనంతరం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని హుజూరాబాద్ అభివృద్ధికి ఇక్కడ ఇంచార్జి గా ఉన్న ప్రణవ్ బాబు నిత్యం మంత్రులతో, అధికారులతో మాట్లాడి నిధులు తీసుకొస్తున్నారని, ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచి వారి అభివృద్ధిని పట్టించుకోకుండా కౌశిక్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడిగా మారాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హుజురాబాద్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ,ప్రణవ్ బాబుకే సాధ్యమని అన్నారు.ఎన్నికల్లో గెలిచిన తర్వాత కౌశిక్ రెడ్డి 1000 రోజుల్లో హుజురాబాద్ కి సున్నా నిధులు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్ అంజలి,కౌన్సిలర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, జనరల్ సెక్రటరీలు, మహిళ నాయకురాళ్లు, మండల పట్టణ నాయకులు, సేవాదళ్, మైనారిటీ, యువజన, యూత్, ఎన్ఎస్యూఐ, సోషల్ మీడియా, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జమ్మికుంట లో..
జమ్మికుంట పట్టణంలో 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పరశురామారావు, పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో కోరపల్లి గ్రామం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీచౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో ప్రజలకు దగ్గరయ్యే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని వాటి ద్వారా ప్రజలకు మరింతగా ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ స్వప్న, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి,డైరెక్టర్లు, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మహిళ పట్టణ, మండల అధ్యక్షురాల్లు, మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇల్లందకుంట లో..
ఇల్లందకుంట మండలంలో మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో ప్రజా పాలన విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఇల్లందకుంట మండల కేంద్రం నుండి పుర వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో ప్రజల మనసు గెలుచుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కౌశిక్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే నియోజవర్గానికి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట దేవాలయ ఛైర్మెన్ రామారావు, డైరెక్టర్లు, సర్పంచులు, మహిళా అధ్యక్షురాలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కమలాపూర్ లో..
కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన 1000 రోజుల విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వని బిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్ళతో ప్రజలు సంతోషంగా ఉంటే బిఆర్ఎస్ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని, వారు చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ప్రతిపక్ష హోదాను సక్రమంగా ఉపయోగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఝాన్సీ, డైరెక్టర్లు, కమలాపూర్ మండల సర్పంచులు, ఉప సర్పంచులు, మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.