ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
బహుజన చైతన్యానికి, సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి వేడుకలను బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుడికాల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కుడికాల భాస్కర్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన గొప్ప యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలు, సామాజిక న్యాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యం సాధించే వరకు బహుజన యువత పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో విస్తృతంగా పెట్టాలి అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు పంజాల రేవంత్, బీసీ అజాది ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జినుకల లక్ష్మణ్ రావు, శివ సింహాద్రి, విగ్నేష్, అభిరామ్,విద్యార్థులు, పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు.