సీపీస్ విధానాన్ని రద్దు చేసి, ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వర్ధన్నపేటలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట, వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు మంగళవారం రోజున ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సిపిఎస్ వద్దు.. ఓపిఎస్ ముద్దు అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ CPS విధానం వల్ల ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత తీవ్రంగా నష్టపోతున్నారు. 30 ఏళ్లు సర్వీస్ చేసినా చేతికి వచ్చేది అంతంత మాత్రమే. షేర్ మార్కెట్ పై ఆధారపడిన CPS వల్ల మా భవిష్యత్తు అంధకారంలో పడింది. OPS విధానంలో అయితే చివరి జీతంలో సగం పింఛన్ గా వస్తుంది, అదే మాకు భరోసా.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు OPS అమలు చేస్తామని హామీ ఇచ్చింది. 30 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే CPS ను రద్దు చేసి, పాత పింఛన్ విధానం (OPS) ను పునరుద్ధరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
ప్రభుత్వాలు వెంటనే పాత పింఛన్ విధానం (OPS) ను పునరుద్ధరించాలి
వర్ధన్నపేటలో ఉద్యోగస్తుల ఆందోళన | పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్.
News URL: https://rightsmedia.in/news/governments-should-immediately-restore-the-old-pension-system-ops