మహబూబాబాద్(రైట్స్ మీడియా): జిల్లా కలెక్టరేట్లో విద్యార్థులకు ట్యాబ్లు, వికలాంగులకు వీల్చైర్లను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పంపిణీ చేశారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
రాష్ట్రాలు
విద్యార్థులకు ట్యాబ్లు, వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
News URL: https://rightsmedia.in/news/government-vip-distributes-tabs-to-students-and-wheelchairs-to-the-disabled
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ
విద్యార్థులు ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని సూచించారు. వికలాంగులకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
విద్యార్థులు, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వికలాంగులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.