తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతో కీలకం. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయంలో ఏర్పడుతున్న జాప్యం కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హుజురాబాద్ బిఆర్ఎస్ యూత్ నాయకులు బండారి ప్రశాంత్ అన్నారు. సర్టిఫికెట్లు నిలిపివేయడం వంటి సమస్యలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలనీ బండారి ప్రశాంత్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేయడంతో పాటు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి జాప్యం లేకుండా కొనసాగించాలి. పేద విద్యార్థుల చదువు ఆగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలానీ , విద్యార్థుల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందనీ అన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు: బండారి ప్రశాంత్
News URL: https://rightsmedia.in/news/government-should-not-play-with-students-future-bhandari-prashanth