ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారి భవిష్యత్తుకు భరోసానిస్తున్నాయని గీసుగొండ మండల విద్యాధికారి ఎస్. రవీందర్ అన్నారు. వివరాల్లోకి వెళితే శనివారం వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ , పి.ఎస్. గొర్రెకుంట పాఠశాల నందు విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత యూనిఫాం మరియు షూస్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా MEO రవీందర్ హాజరయ్యారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
గొర్రెకుంట పాఠశాలలో యూనిఫాం, షూస్ ఉచిత పంపిణీ
News URL: https://rightsmedia.in/news/free-distribution-of-uniforms-and-shoes-at-gorrekunta-school
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న యూనిఫాం, షూస్ ను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో మెలగుతూ చక్కగా విద్యను అభ్యసించాలని సూచించారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా, ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్. జ్యోతిర్మయి, బి. లక్ష్మి, ఎ. రజిత, ఆర్పీ జన్ను నిర్మల, కోట అరుణ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం మార్త శ్రీనివాస్, సిహెచ్. అనిత, మంద ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.