హసన్పర్తి,అక్టోబర్ 27(రైట్స్ మీడియా):
రాబోయే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్పర్తి మండలం సిద్దాపూర్ గ్రామంలో నూతనంగా ఉచిత ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని మంగళవారం వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.
అర్హులైన పట్టభద్రులందరూ ఈ ఉచిత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ మసూద్, మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బండి రజనికుమార్, పీఏసీఎస్ (PACS) మాజీ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, సిద్దాపూర్ ఉప సర్పంచ్ కొక్కిస ప్రసన్న-క్రాంతి, వార్డ్ మెంబర్ ముస్కు అభిలాష్, మాజీ సర్పంచ్ ఈశ్వరమ్మ పాల్గొన్నారు.
వీరితో పాటు వివిధ గ్రామాల అధ్యక్షులు ఆళ్ల పరమేష్, రామకృష్ణ, జనార్ధన్, మాజీ సర్పంచ్ ఆళ్ల రవీందర్, నాయకులు తగరం చిరంజీవి, రాజకుమార్, శ్రీధర్, రాకేష్, కొత్తపేట రాజు, ఉస్మాన్ అలీ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ ఓటరు నమోదు కేంద్రం ప్రారంభోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.