ఆర్మూర్ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆర్మూర్ మరియు మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ వారు సంయుక్తంగా మంగళవారం ఆర్మూర్ న్యాయస్థాన సముదాయంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మెడికవర్ హాస్పిటల్స్‌కు చెందిన వైద్యులు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మాలు ఆనంద్ నందకిషోర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీష్ చంద్రబోస్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మణిదీప్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ శరణ్య పాల్గొని వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సలహాలు అందించారు.
ఈ శిబిరంలో భాగంగా రక్తపోటు (బీపీ), ఈసీజీ, 2డి ఎకో తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన వైద్య సూచనలు చేశారు. గుండె సంబంధిత సమస్యలు, ఎముకలు మరియు కీళ్ల సమస్యలు, మహిళల ఆరోగ్య సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించారు.
ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని ఈ సందర్భంగా ముఖ్యఅతిథి శ్రీమతి పి శ్రీదేవి సీనియర్ సివిల్ జడ్జి మరియు చైర్ పర్సన్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ వారు తెలిపారు.
న్యాయస్థాన సిబ్బందికి ఆరోగ్య సేవలను అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం ఉపయోగకరంగా నిలిచింది. ఈ శిబిరంలో సుమారు 200 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని వైద్య సలహాలు తీసుకున్నారు.