వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని తక్షశిల జూనియర్ కళాశాలలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పి మండల సదస్సు వర్ధన్నపేట మండల ఇన్చార్జ్ జిల్లా ధర్మయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా ఎంఎస్ పి జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగూరి ఆనంద్ రావు మాదిగ, ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ కట్ల రాజశేఖర్ మాదిగ హాజరై నూతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పి మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎమ్మార్పీఎస్ వర్దన్నపేట మండల అధ్యక్షుడుగా చాడ కరుణాకర్ మాదిగ, అధికార ప్రతినిధిగా సీనపెల్లి రాజు మాదిగ, ప్రధాన కార్యదర్శులు బిర్రు ప్రభాకర్ మాదిగ, కందిక చంద్రమౌళి మాదిగ, ఉపాధ్యక్షులుగా ఎలికట్టే అజయ్ మాదిగ, కార్యదర్శిగా సిలువేరు రాజు మాదిగ ఎన్నికైనారు.
ఎంఎస్పి వర్దన్నపేట మండల అధ్యక్షులుగా ముత్యాల మల్లేష్ మాదిగ, అధికార ప్రతినిధిగా కలకోట్ల రాజు మాదిగ, ప్రధాన కార్యదర్శిగా మరుపట్ల మస్తాన్ మాదిగ,ఉపాధ్యక్షులుగా జోగు రవి మాదిగ,కార్యదర్శిగా ముత్యాల నులేందర్, సహాయక కార్యదర్శిగా సీన పెళ్లి రవి మాదిగ ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ చంద్రయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వర్దన్నపేట ఎంఎస్ పి, ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీల ఎన్నిక
ఎంఎస్ పి మండల అధ్యక్షుడిగా ముత్యాల మల్లేశం మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా చాడ కరుణాకర్ మాదిగ ఎన్నికైనారు.
News URL: https://rightsmedia.in/news/election-of-new-mandal-committees-for-vardhannapet-msp-and-mrps