కాకతీయ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిగా బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ టి. శాస్త్రి నియమితులయ్యారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను డాక్టర్ టి. శాస్త్రి వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించారు. ఆయన ప్రస్తుత స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య వై. వెంకయ్య నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. డాక్టర్ టి. శాస్త్రి 2010లో కాకతీయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బయోటెక్నాలజీ విభాగ ఇన్చార్జిగా, హాస్టల్ జాయింట్ డైరెక్టర్గా, బయోటెక్నాలజీ విభాగ పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులుగా, విభాగాధిపతిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఫారిన్ రిలేషన్స్ ఆఫీసర్గా, బయోటెక్నాలజీ విభాగ పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులుగా, విభాగాధిపతిగా, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ అండ్ అలైడ్ డిసిప్లిన్స్ అదనపు సంచాలకులుగా సేవలందిస్తున్నారు. 2016–17లో పోస్ట్డాక్టరల్ పరిశోధనలో భాగంగా అమెరికాలోని మిసిసిపీ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు నిర్వహించారు. ఇప్పటివరకు 57 అంతర్జాతీయ, 20 జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించారు. సుమారు రూ.5 కోట్ల విలువైన నాలుగు మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఆరుగురు పరిశోధక విద్యార్థులకు పీహెచ్డీ పర్యవేక్షకులుగా మార్గనిర్దేశం చేసి వారి పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయించారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా కూడా కొనసాగుతున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డాక్టర్ టి. శాస్త్రిని విశ్వవిద్యాలయ బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
నూతన స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శిగా డాక్టర్ టీ. శాస్త్రి
News URL: https://rightsmedia.in/news/dr-t-sastry-appointed-as-secretary-of-the-new-sports-board