మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి గురువారం సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్సీలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను డీఎంహెచ్వో పరిశీలించారు. వైద్య సేవలకు సంబంధించిన సూచికలు (ఇండికేటర్లు), లక్ష్యాల సాధనపై సమీక్ష నిర్వహించారు. ప్రతి విభాగంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా సమర్థవంతంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు రికార్డుల నిర్వహణలో కచ్చితత్వం పాటించాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని డీఎంహెచ్వో ఆదేశించారు. పీహెచ్సీకి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
పీహెచ్సీ సేవలపై డీఎంహెచ్వో సమీక్ష.
News URL: https://rightsmedia.in/news/dm-ho-reviews-phc-services