మీరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్, ఓపి రిజిస్టర్, ల్యాబ్ టెక్నిషియన్స్ రిజిస్టర్, మెడిసిన్ స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ లీవ్ లో ఉన్నట్లు తెలపగా లీవ్ లెటర్లు చెక్ చేశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి అన్ని మెడికల్ పరికరాలు ఎక్కువ మొత్తంలో పెట్టుకోవాలని, గ్రామీణ ప్రాంతాలు కావున సీజనల్ వ్యాధులకు ఇతరత్ర వ్యాధులకు సంబంధించి మెడిసిన్ అన్నియు అందుబాటులో ఉంచుకోవాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి అత్యంత జాగ్రత్తగా, ఓపికగా మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందిస్తున్నారని భరోసా కల్పించాలని ఆదేశించారు.
మెడికల్ ఆఫీసర్ నుండి కింది స్థాయి సిబ్బందికి వరకు సమయపాలన పాటించాలని ఆదేశించారు. పై అధికారి అనుమతి లేనిదే సెలవు తీసుకుంటే జీతంలో కోత తప్పదని హెచ్చరించారు.
చర్మ వ్యాధి వలన ఆసుపత్రికి వచ్చిన వృద్ధుని తో మాట్లాడుతూ చర్మవ్యాధులు ఎక్కువ మొత్తంలో మనం తినే ఆహారం, నీటి ద్వారానే వస్తాయని, మంచి ఆహారం తీసుకోవాలని కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేసుకోవాలని సూచించారు. వృద్ధులకు, దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులు, మోకాళ్ళ నొప్పులు బాధపడే వారికి ఆయుష్ యునానిలో మంచి వైద్యం ఉందని, ఈ వృద్ధినికి చర్మ వ్యాధికి వైద్యం చెయ్యాలని యునాని డాక్టర్ ను ఆదేశించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
మీరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు.
News URL: https://rightsmedia.in/news/district-collector-visited-the-primary-health-centre-at-the-doddi-mandal-headquarters