భద్రకాళి చెరువు పరిధిలో చేపట్టాల్సిన వరద నివారణ చర్యలు, ముందస్తు రక్షణ పనులపై జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు, సంబంధిత రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
భద్రకాళి చెరువు వరద నివారణ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష
News URL: https://rightsmedia.in/news/district-collector-reviews-bhadrakali-lake-flood-prevention-works
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా చెరువు నీటి ప్రవాహం, వరద పరిస్థితులు, కాలువలు, నీటి విడుదల మార్గాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరద నివారణ పనులను ముందస్తుగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశానికి వరంగల్ ఆర్డీవో సుమ, ఇరిగేషన్ ఎస్ ఇ రామ్ ప్రసాద్, ఇ ఇ ,కిరణ్ , డి ఇ మధుసూదన్ రెడ్డి, వరంగల్ ఖిలా వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్,ఇక్బాల్, తదితరులు పాల్గొన్నారు.