వరంగల్ జిల్లా నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న నీట్ పీజీ–2026 పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ ఆదివారం పరిశీలించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
నర్సంపేటలో నీట్ పీజీ-2026 పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
News URL: https://rightsmedia.in/news/district-collector-inspects-neet-pg-2026-exam-center-in-narsampet
పరీక్ష కేంద్రంలో సౌకర్యాల పై సూచన
ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, బయోమెట్రిక్, సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, పరీక్షా నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, తాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీఓ, తహసీల్దార్, బిట్స్ కాలేజీ యాజమాన్యం, పరీక్షా నిర్వహణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.