ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రతిపాదిత కాజీపేట శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి గురువారం పరిశీలించారు. ప్రస్తుతం సిటీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ముందు ఉన్న స్థలాన్ని, రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంతంతో పాటు, స్టేడియానికి ఎదురుగా ఉన్న రైల్వేకు చెందిన సుమారు ఎకరం భూమిని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కాజీపేట బస్ స్టేషన్ కు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
News URL: https://rightsmedia.in/news/district-collector-chahat-bajpai-inspects-the-proposed-site-for-kazipet-bus-station
కాజీపేట ప్రధాన రహదారి పక్కన ఉన్న హైదరాబాద్ కు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆగే బస్టాండ్ ను కలెక్టర్ పరిశీలించారు. కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద శాశ్వత బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన రైల్వే శాఖ ద్వారా ప్రతిపాదిత భూమిని సమకూర్చుకోవడం, రైల్వే శాఖతో భూమి మార్పిడి ప్రక్రియను పూర్తి చేయడం, తదితర అంశాలను చర్చించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం భవానీ ప్రసాద్ , డిప్యూటీ ఆర్ఎం కిషన్ రావు, డిఎం ధరమ్ సింగ్, కాజీపేట తహసిల్దార్ రాజు, రైల్వే శాఖ ఇన్స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ శ్రీనివాస్, కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.