జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10.09.2026న అంబేద్కర్ చౌక్, బస్ స్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ ఏ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, AES మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి డా.శ్రీకాంత్ సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఓపీ విగ్రహాలకు బదులు మట్టి విగ్రహాలనే వాడాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రజలకు 300 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భూపాలపల్లిలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి డా.శ్రీకాంత్ విద్యార్థులకు పర్యావరణ హిత మట్టి విగ్రహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు 500 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.