జీడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 30(రైట్స్ మీడియా):
గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
బుధవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పూర్తయిన, కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్, పోతరాజుపల్లి, ఉర్సు, తోట మైదానం, గిర్మాజిపేట, చార్బౌలి, లక్ష్మీపురం మార్కెట్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల పనులను వరంగల్ చౌరస్తా వద్ద చేపట్టిన పైప్లైన్ పనులను తనిఖీ చేశారు.
అదేవిధంగా ఖాజీపేట సర్కిల్ పరిధిలోని బంధం చెరువు, ఖాజీపేట దర్గా సమీపంలో, పిస్తా హౌస్ ప్రాంతాల్లో చేపట్టిన పనులతో పాటు శాయంపేటలో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను, ఉర్సు వద్ద నిర్మిస్తున్న యుపిహెచ్సి భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.