వర్ధన్నపేట మండలంలోని రైతులకు వెంటనే దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు అడప రాజు డిమాండ్ చేశారు. సోమవారం రోజున వర్ధన్నపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వర్ధన్నపేట మండలంలోని గ్రామాల్లో వేల ఎకరాల్లో వరి, పత్తి, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టు కాలువలు, చెరువులకు నీరు విడుదల చేయకపోవడంతో రైతులు బోర్లు, బావులపై ఆధారపడి లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా దేవాదుల నీటి విడుదలపై పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదులను నిర్లక్ష్యం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విదంగా నడుస్తోంది. వెంటనే దేవాదుల నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు అందించాలి అని అడపరాజు డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రైతులను కలుపుకొని ధర్నా, రాస్తరోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు , కిసాన్ మోర్చా నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వర్ధన్నపేట రైతులకు దేవాదుల నీరు విడుదల చేయాలి
--బీజేపీ మండల అధ్యక్షుడు అడపరాజు.
News URL: https://rightsmedia.in/news/devadalu-water-should-be-released-to-the-farmers-of-wardhannapet