యూజీసీ–డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (UGC–DEB) ఆదేశాల మేరకు 2026–27 విద్యా సంవత్సరానికి ఆగస్టు 2026 విద్యా సెషన్లో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL), ఆన్లైన్ విధానంలో ప్రవేశాల చివరి తేదీని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 13, 2026 వరకు పొడిగించినట్లు కాకతీయ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య బి. సురేష్ లాల్ తెలిపారు. కేయూ దూరవిద్య ద్వారా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందదలచిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కేయూ దూరవిద్య ప్రవేశాల గడువు పొడిగింపు
కేయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆచార్య బి. సురేష్ లాల్.
News URL: https://rightsmedia.in/news/deadline-extended-for-ku-distance-education-admissions