రాష్ట్రంలోని ఆడబిడ్డల పెండ్లిలకు ఇస్తున్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసినందుకు కుట్ర చేస్తుందని వర్ధన్నపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుళ్ల కుమార్ స్వామి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపుమేరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఆదేశాలతో మంగళవారం రోజున టిఆర్ఎస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు కుమారస్వామి, గోధుమల మధుసూదన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు వర్ధన్నపేట తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, స్థానిక తహసిల్దార్ విజయసాగరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల, పట్టణ అధ్యక్షులు తుల కుమారస్వామి, గోధుమ మధుసూదన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకంలో అదనంగా తులం బంగారం ఇష్టమని చెప్పి మహిళను మోసం చేసి, ఓట్లు దండుకొని అధికారానికి వచ్చిందని ఆరోపించారు.
హైకోర్టు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించడం ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కార్ అసమర్ధతకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలోని మహిళా లోకానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, మున్సిపల్ కౌన్సిలర్లు గుజ వీరన్న, తిరుపతి సురేష్, మాజీ మార్కెట్ చైర్మన్ గుజ్జ సంపత్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నూనె బిక్షపతి, మాజీ సర్పంచ్ వేణు, బీఆర్ఎస్ నాయకులు భానోతు నవీన్, సింగర బోయిన రాజశేఖర్, తుమ్మల శ్రీధర్, దుగ్యల మాధవరావు, రహీం, పూజారి రఘు, రామన్న, గోర, సురేందర్, బొడ్డుపెల్లి. శ్రీకాంత్, మధుసూదన్, బుచ్చిరెడ్డి, మహేందర్, మాలోత్తు వెంకన్న, చందర్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్ర
-- వర్ధన్నపేట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ళ కుమారస్వామి.
News URL: https://rightsmedia.in/news/conspiracy-to-cancel-kalyan-lakshmi-and-shaadi-mubarak-schemes