మహబూబాబాద్(రైట్స్ మీడియా): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తొ కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్, ఆర్అండ్బి (R&B), రవాణా (RTO), నేషనల్ హైవేస్ (NHAI), పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో "రోడ్డు భద్రత & ప్రమాదాల నివారణ"పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి
ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులు అందరూ బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాను రోడ్డు ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని అన్నారు. శాశ్వత నివారణ: జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను (Black Spots) తక్షణమే గుర్తించి రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సరిచేయాలి. డేంజర్ జోన్లు, మలుపుల వద్ద స్పష్టమైన హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రేడియంట్ స్టిక్కర్లు, కేట్ ఐస్ (Cat Eyes) ఏర్పాటు చేయాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతి వేగం (Over Speeding), డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై కఠిన తనిఖీలు చేపట్టాలి. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని, పరిమితికి మించి లోడ్ (Overloading) తో వెళ్లే వాహనాలపై భారీ జరిమానాలు విధించాలని అన్నారు.
వర్షాల వల్ల రోడ్లపై ఏర్పడిన గోతులను (Potholes) తక్షణమే పూడ్చివేయాలి. రాత్రి వేళల్లో రహదారులపై తగినంత వెలుతురు ఉండేలా వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచాలి. ప్రధాన రహదారుల పక్కన అక్రమంగా పార్క్ చేసే వాహనాలపై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లలో విద్యార్థులకు, ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లకు సురక్షిత ప్రయాణ నియమాలపై కౌన్సెలింగ్ ఇవ్వాలని, ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలా 108 అంబులెన్స్ సేవలను అనుసంధానించాలని, రహదారులకు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఎల్లప్పుడూ అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ప్రతి నెలా అన్ని శాఖల అధికారులు సమావేశమై రోడ్డు భద్రత పురోగతిపై సమీక్ష జరపాలని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎక్కువగా మరిపెడ, తొర్రూరు, గూడూర్, మండలలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మరిపెడ జాతీయ రహదారి నెంబర్ 365, 563, పై సమస్యలు గుర్తించమని కేవలం మరిపెడ లో (13) మంది చనిపోయారని, అలాగే కాంపెల్లి, కందికొండ, ఉప్పరి గూడెం, నల్లెల, తొర్రూరు పాలకేంద్రం జంక్షన్, టౌన్, గూడూరు మండల కేంద్రం, భూపతిపేట, దామరవంచ, బొద్దుగొండ, వద్ద హై టెంక్షన్ వైర్ల, సమస్యలు, మహబూబాబాద్ టౌన్, బెతోల్, తల్లపుసపల్లి, కురవి ఏకవలవ్య స్కూల్, బయ్యారం జాతీయ రహదారి 930 పి, పై సాయిబాబా, టెంపుల్, సత్యనారాయణపురం, కొత్తపేట, గంధంపల్లి, లలో సమస్యల పరిష్కారం కోసం వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ప్రయాణం చేసే విధంగా అవగాహన కల్పించే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాలని కోరారు.
రహదారులపై సంతలు( అంగడి) నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని, హైవే పై ప్రత్యేక వాహనాలు పెట్రోలింగ్ నిర్వహించాలని, అంబులెన్స్ లు అందుబాటులోకి ఉంచుకోవాలని సూచించారు. రహదారుల వెంబడి స్థలాలను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలని, బిల్డింగ్ పర్మిషన్లను తనిఖీ చేయాలని, అన్ని విభాగాలకు సంబంధించి రోడ్డు భద్రత అంశాలపై ఎలాంటి నిధులు అవసరమున్న వెంటనే నివేదికలు తయారుచేసి వారం రోజులుగా పంపాలని కలెక్టర్ సంబంధిత అధికారులు ఆదేశించారు,
రోడ్డు భద్రత తదితర అంశాలపై పిల్లలు ప్రజల్లో విస్తృత అవగాహన ప్రచారం కల్పించాలని తెలిపారు,
అన్ని విభాగాల సంబంధిత అధికారులు జాయింట్ యాక్షన్ ప్లాన్ ప్రకారం నివేదికలు రెడీ చేసి తీసుకోవలసిన జాగ్రత్తలపై యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని, జాతీయ రహదారుల వెంబడి నిబంధనల మేరకు మద్యం దుకాణాలను అనుమతి ఇవ్వాలని అన్నారు,
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి పోలీసు శాఖ తరఫున నిరంతర నిఘా మరియు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై, సీట్ బెల్ట్ ధరించని వారిపై, అతివేగం (Over Speeding) మరియు మద్యం తాగి వాహనాలు నడిపే (Drunk and Drive) వారిపై రాజీ లేని తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానులతో పాటు వారి తల్లిదండ్రులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పరిమితికి మించి లోడ్‌తో వెళ్లే (Overloading) లారీలు, ట్రాక్టర్లు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని, అలాంటి వాహనాలపై భారీ జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు.
రహదారుల పక్కన, జాతీయ రహదారులపై అక్రమంగా వాహనాలను నిలిపివేస్తే RTO మరియు ట్రాఫిక్ పోలీసులు వెంటనే క్రేన్ల సహాయంతో తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్లను సమూహాలుగా చేసి వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా, రోడ్డు నియమాలు పాటించేలా పోలీసు స్టేషన్ల వారీగా ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పీడీ పురుషోత్తం, ఆర్ అండ్ బి ఈఈ రాజు, డీఎస్పీ తిరుపతి రావు, డిఆర్ఓ నాగలక్ష్మి,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్, నేషనల్ హైవే పిడి,పిఆర్, ఆర్ అండ్ బి, ఈ ఈ లు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డివిహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమేష్, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ, సంక్షేమ శాఖ అధికారులు, ఆర్సిఓ లు, ఇంటర్ మీడియట్ అధికారి మదర్, ఎక్సైజ్, పోలీస్, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ రేవంత్, సంబంధిత అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.