జనగామ(రైట్స్ మీడియా): పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపు మేరకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జనగామకు తరలివచ్చి కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా జనగామ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సమావేశమయ్యారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జనగామ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తూ ముందుకు సాగగా, కలెక్టర్ కార్యాలయం వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
తదనంతరం జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లకవత్ ధన్వంతి లక్ష్మీనారాయణ తో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వినతిపత్రం అందజేశారు.