హనుమకొండ(రైట్స్ మీడియా): గురుకుల పాఠశాలలో పరిశుభ్రత ప్రాధాన్యత నివ్వాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం లోని రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడి ఈరోజు ఎం బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు.. వంటలు ఎలా ఉంటున్నాయి, టీచర్లు అందరూ వస్తున్నారా అని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో, కళాశాలలోని తరగతి గదులు, డార్మేట్రీ వసతులను కలెక్టర్ పరిశీలించారు. అన్నీ గదుల్లో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఫ్యాన్ లు ఉన్నాయా అని ఆరా తీశారు. దోమలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు డార్మేట్రి, టాయిలెట్స్ శుభ్రం చేస్తున్నారా అని ఉపాధ్యాయులను కలెక్టర్ అడిగారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తున్నారా, టైం టేబుల్ ప్రకారం అన్నీ తరగతులు జరుగుతున్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. వంట గదిని సందర్శించి వంట పదార్థాలు ఎలా ఉన్నాయని తనిఖీ చేశారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వేలేరులోని రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
News URL: https://rightsmedia.in/news/collector-conducts-surprise-inspection-of-residential-school-and-college-in-velairu
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...
టైం టేబుల్ ప్రకారం అన్నీ తరగతుల సిలబస్ ను ఉపాధ్యాయులు పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా డార్మేట్రీ గదులకు మెష్ డోర్ లను ఏర్పాటు చేయాలన్నారు. వసతులు బాగుండేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, ఇతర ఆహార పదార్థాలను నాణ్యతతో అందించాలన్నారు. కూరగాయలు, నిత్యావసరాలు తాజాగా, నాణ్యతగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదగిరి, తహసీల్దార్ కోమీ, వైస్ ప్రిన్సిపల్ సజన, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.