వెలకట్టలేని మధుర బంధమే రక్షాబంధన్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గురువారం రోజున సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా కాజీపేటలోని వండర్ ప్లే స్కూల్ చిన్నారులు ఎమ్మెల్యే నాగరాజుకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఎమ్మెల్యే స్వీట్స్ తినిపించి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగా ప్రతి కుటుంబంలో ఆనందం ఆప్యాయతలు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ వినీలా,మౌనిక తదితరులు పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి రాఖీ కట్టిన చిన్నారులు
News URL: https://rightsmedia.in/news/children-tie-rakhi-to-mla-kr-nagaraju