భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భూటాన్లో పర్యటన
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సెప్టెంబర్ 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు భూటాన్లో పర్యటనలో భాగంగా, జ్ఞానేష్ కుమార్ థింఫూలో భూటాన్ రాజును కలుస్తారు మరియు సెప్టెంబర్ 15న పారోలోని జిగ్మే సింగ్యే వాంగ్చుక్ లా స్కూల్లో జరిగే భూటాన్ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. సెప్టెంబర్ 16వ తేదీన, ప్రధాన ఎన్నికల కమిషనర్ భూటాన్ ప్రధానమంత్రి డాషో షెరింగ్ టోబ్గేతో సమావేశమై, సీనియర్ సివిల్ సర్వెంట్లతో సంభాషిస్తారు. ఇరు దేశాల ఎన్నికల సంఘాల మధ్య ఉన్న సన్నిహిత సంస్థాగత సహకారాన్ని, ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగు.
భారత్-భూటాన్ ఎన్నికల సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.