జయశంకర్ భూపాలపల్లి(రైట్స్ మీడియా):
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న “ఛలో హైదరాబాద్ – ఉద్యోగుల హక్కుల సాధన సభ” ను విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ & పెన్షనర్స్ జేఏసీ (TGEJAC) జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో TGEJAC జిల్లా చైర్మన్ బూరుగు రవి, కన్వీనర్ శ్రీమతి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.
సెప్టెంబర్ 10న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఉద్యోగుల హక్కుల సాధన సభకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్లు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఉద్యోగుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 10న ‘ఛలో హైదరాబాద్’
ప్రధాన డిమాండ్లు:
• 01-07-2023 నుంచి పెండింగ్లో ఉన్న PRCని మెరుగైన ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలి.
• ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలి.
ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల పరిష్కారానికి నెలకు రూ.2,000 కోట్లు కేటాయించి చెల్లింపులు చేపట్టాలి.
• CPS విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలి.
NEHS (New Employees Health Scheme)ను పూర్తి స్థాయిలో, సమర్థవంతంగా అమలు చేయాలి.
• ప్రభుత్వం హామీ ఇచ్చి ఇంకా అమలు చేయని మిగిలిన డిమాండ్లన్నింటినీ వెంటనే పరిష్కరించాలి.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.
హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములై ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
“మన హక్కుల సాధన కోసం…
మన భవిష్యత్తు కోసం…
ఛలో హైదరాబాద్ – కదలిరండి… విజయవంతం చేయండి!” అని పిలుపునిచ్చారు.
ఈ సన్నాహక సమావేశంలో డీఎంహెచ్వో మధుసూదన్, దశరథ రామారావు (టీఎన్జీవో జనరల్ సెక్రెటరీ), షఫీ (సర్కార్ కేంద్ర సంఘం, టీఎన్జీవోస్), ఎస్.కె. అబ్బాస్ (రెవెన్యూ సంఘం), కుసునపు కిరణ్ కుమార్ (పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి), నక్క తిరుపతి (యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు), మందల రవీందర్ రెడ్డి (తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం అధ్యక్షులు), పెండ మధుసూదన్ (టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు), కొత్త కుమార్ (యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి), తిరుపతి రెడ్డి (డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి), సేవా నాయక్ (టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు), భార్గవ్ (సీపీఎస్ ఉద్యోగుల సంఘం)తో పాటు సుకుమార్, వంశీ, సునీత, ప్రవీణ్ కుమార్, దేవేందర్, మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మహేశ్వరి, రాజ్ కుమార్, ప్రతాప్, సరోజ, సుధాకర్ తదితర TGEJAC భాగస్వామ్య సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.