కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య (CDOE/SDLCE) 2026 సంవత్సరానికి సంబంధించిన వివిధ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. CDOE/SDLCE యూజీ I, II & III ఇయర్ వైజ్ పరీక్షలు ఈ నెల 21-09-2026 నుండి ప్రారంభం కానున్నాయని, ఈ పరీక్షలను 15 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు 15 మంది పరిశీలకులను (Observers) నియమించగా, మొత్తం 6,621 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అలాగే, CDOE/SDLCE యూజీ II & III సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26-09-2026 నుండి ప్రారంభం కానున్నాయని, వీటిని 10 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 10 మంది పరిశీలకులను నియమించగా, మొత్తం 3,757 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అదేవిధంగా, CDOE/SDLCE పీజీ II & III సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21-09-2026 నుండి ప్రారంభం కానున్నాయని, ఈ పరీక్షలు 15 పరీక్షా కేంద్రాల్లో జరుగనున్నాయని తెలిపారు. వీటి పర్యవేక్షణకు 15 మంది పరిశీలకులను నియమించగా, మొత్తం 5,494 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. CDOE (SDLCE) డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ మరియు DCA పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు, ఈ పరీక్షలకు ఒక పరీక్షా కేంద్రం, ఒక పరిశీలకుడిని ఏర్పాటు చేయగా, మొత్తం 280 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాలను కాకతీయ విశ్వవిద్యాలయం sdlce అధికారిక వెబ్సైట్ లో పరిశీలించవచ్చని తెలిపారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
CDOE/SDLCE దూర విద్య పరీక్షల తేదీలు ఖరారు
• పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల.
News URL: https://rightsmedia.in/news/cdoe-sdlce-distance-education-exam-dates-finalized