RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
ముదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో దారుణ హత్య..
News URL: https://rightsmedia.in/news/brutal-murder-near-mudireddipalli-village
బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండలంలోని ముదిరెడ్డిపల్లె గ్రామ సమీప పొలంలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు (62) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా చంపారు. లింగమయ్య స్వామి కొండ సమీపంలోని తన పొలం వద్ద ఉండగా ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. హత్య అనంతరం ఆయన జేబులో ఉన్న రూ. 90 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక వివాదాలా, పాత కక్షలతో సొంత బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారా? లేక కేవలం నగదు కోసమే దుండగులు హత్య చేశారా అనే కోణంలో కలసపాడు ఎస్సై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.