భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సభాపతిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్ మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్, 22ఏ అంశం, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చర్చించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాక్ అసెంబ్లీ
News URL: https://rightsmedia.in/news/brs-mlas-mock-assembly-at-telangana-bhavan
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇందిరా గాంధీ కట్టింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాము. ఏ సంవత్సరం వంద రోజులో మేము చెప్పలేదు కదా. ఢిల్లీ వాళ్ళతో మాకుండే ఇబ్బందులు మాకు ఉన్నాయి. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని మేము చూశాము. రైతాంగం ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీకి పోతే మమ్మల్ని చూసేవాడే లేడు. మా బాధలు మాకే ఉన్నాయని అన్నారు.