రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలని బిఆర్ఎస్ మండల కమిటీ పిలుపునిచ్చింది. హసన్పర్తి మండల కేంద్రంలో శనివారం రోజున విలేకరుల సమావేశం, ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసనలకు బిఆర్ఎస్ పిలుపు
ఈ సమావేశంలో బిఆర్ఎస్ హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బండి రజనీకుమార్ మాట్లాడుతూ...
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తి మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ శ్రేణులుగా తరలివచ్చి, ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే నిరసన కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లి, వారిని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉంద ని ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ 66వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పావుశెట్టి శ్రీధర్, 53వ డివిజన్ ఇన్చార్జ్ బోడ యుగంధర్, నాయకులు గిన్నారపు రవీందర్, ఇమ్మడి రాజేందర్, కేదాసి రాకేష్, దోనపాటి చంద్రకర్ రెడ్డి, దాసరి మారి, చాతల్ల వేణు, మట్టెడ ప్రమోద్, తాళ్ల మహేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.