హనుమకొండ (రైట్స్ మీడియా): తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గౌడ్ 54వ జన్మదిన వేడుకలను హనుమకొండలోని 54వ డివిజన్లో OBC ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం వివిధ సంఘాల నాయకులు, బీసీ మరియు గౌడ సంఘాల ప్రతినిధులు ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఒబిసి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బొనగాని యాదగిరి గౌడ్ జన్మదిన వేడుకలు
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..
గౌడ సమాజం గర్వించేలా, ఎదుటివారికి స్ఫూర్తినిచ్చేలా బొనగాని యాదగిరి గౌడ్ సేవా కార్యక్రమాలు సాగుతున్నాయని కొనియాడారు. సమాజ శ్రేయస్సే సంకల్పంగా, ఎందరో గౌడ బిడ్డలకు ధైర్యాన్ని ఇస్తూ నిరంతరం సేవా మార్గంలో పయనిస్తున్న ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో OBC ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, రాష్ట్ర జాయింట్ కార్యదర్శి వేణు మాధవ్ గౌడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చక్రపాణి, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తీగల భరత్ గౌడ్, ధర్మ సేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనగంటి శ్రీకాంత్, ఇన్స్పైర్ జూనియర్ కాలేజీ డైరెక్టర్లు తీగల రాజ్ కుమార్ గౌడ్, శ్రీరాం రెడ్డి, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బండారి జనార్దన్ గౌడ్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకొండ రమేష్ గౌడ్ తో పాటు బీసీ సంఘాల నాయకులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.