వర్ధన్నపేట పీఏసీఎస్ (PACS) డైరెక్టర్‌గా ఎన్నికైన బిర్రు మధు మాదిగను పలువురు నాయకులు, కుల పెద్దలు ఘనంగా సన్మానించారు. ఎమ్మార్పీఎస్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతనంగా ఎన్నికైన డైరెక్టర్ మధు మాదిగను వారు శాలువాలతో ఘనంగా సత్కరించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని పీఏసీఎస్ డైరెక్టర్ ఎన్నికకు పూర్తిస్థాయిలో సహకరించిన స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు కి, అలాగే ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు, నల్లబెల్లి గ్రామ నాలుగవ వార్డు మెంబర్ గోలి సుధాకర్ మాదిగ, కుల పెద్దలు గోలి పుల్లయ్య మాదిగ, బిర్రు బాబన్న మాదిగ, బిర్రు సుదర్శన్ మాదిగ పాల్గొన్నారు. అలాగే ఎంఎస్పీ మాజీ మండల అధికార ప్రతినిధి బిర్రు బిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ గ్రామ సీనియర్ నాయకులు బిర్రు రవీందర్ మాదిగ, బిర్రు ఐలయ్య మాదిగ, బిర్రు చంద్రమోహన్ మాదిగ, గోలి కుమార్ మాదిగ, బిర్రు సునీత మాదిగ తదితరులు పాల్గొని నూతన డైరెక్టర్‌కు అభినందనలు తెలిపారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వర్ధన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్‌గా బిర్రు మధు.. ఘన సన్మానం
- ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ బిర్రు మహేందర్ మాదిగ.
- ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు.
News URL: https://rightsmedia.in/news/birru-madhu-appointed-as-director-of-wardhannapet-pacs-a-great-honor