కాకతీయ విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో బి.సి. సెల్ సంచాలకులు డాక్టర్ బి. సతీష్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన బి.పి. మండల్ 108వ జయంతి కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ పాల్గొని, మండల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
ఆదర్శ ప్రాయుడు బి పి మండల్: వీసి ఆచార్యులు ప్రతాప్ రెడ్డి
బి.పి. మండల్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం విశేష కృషి చేసిన ఆదర్శప్రాయుడని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అన్నారు.
News URL: https://rightsmedia.in/news/b-p-mandal-a-role-model-vice-chancellor-acharya-pratap-reddy
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ,.
బి.పి. మండల్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, సామాజిక న్యాయం పట్ల ఆయన చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొని బి.పి. మండల్‌కు నివాళులర్పించారు.