జపాన్ లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడలలో భారత స్టార్ షూటర్ ఎలవెనిల్ వలరివన్ అద్భుత ప్రదర్శన కొనసాగించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్స్లో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి మరో పతకాన్ని అందించారు. జపాన్ షూటర్ హినాటా తైచి స్వర్ణ పతకం సాధించగా, దక్షిణ కొరియా క్రీడాకారిణి బాన్ హ్యోజిన్ కాంస్య పతకం దక్కించుకున్నారు. ఫైనల్ ఆరంభం నుంచే ఎలవెనిల్ అగ్రస్థానంలో నిలిచారు. మొదటి సిరీస్లో 53.1 పాయింట్లతో ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. మరో భారత షూటర్ సోనమ్ మస్కార్ 52.1 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. పోరు సాగుతున్న కొద్దీ ఎలవెనిల్ తన జోరును కొనసాగించారు. పది షాట్ల తరువాత 106.0 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగారు. ఎలిమినేషన్ దశలోనూ అద్భుతమైన షాట్లు (10.6, 10.3, 10.8, 10.7) కొడుతూ ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. మరో ఫైనలిస్ట్ సోనమ్ మస్కార్ తీవ్ర పోరాటం చేసినప్పటికీ, కీలక దశలో వరుసగా 9.9, 10.5 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎలవెనిల్ మాత్రం చివరి వరకు తన జోరును కొనసాగించి రజత పతకాన్ని పక్కా చేసుకున్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
అంతర్జాతీయం
ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం
News URL: https://rightsmedia.in/news/another-medal-for-india-at-the-asian-games