ప్రభుత్వ బాలిక సదనం లో రక్షణ సంరక్షణ విద్యా బుద్ధులు నేర్చుకొని తన ఇష్టాలకు అనుగుణంగా దత్తతకు ఒప్పుకొని కేంద్ర దత్తత ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం రోజున నల్గొండ జిల్లాకు చెందిన దంపతులకు కలెక్టర్ ఛాంబర్ లో చట్టబద్ధమైన దత్తత అందించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
ప్రభుత్వ బాలిక సదనం నుంచి మరో దత్తత
⏩బాలికను అభినందించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్.
News URL: https://rightsmedia.in/news/another-adoption-from-the-government-girls-home
ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ...
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని అన్నారు. కాగా దత్తత కి ఇచ్చిన బాలికతో, దత్తత తీసుకున్న తల్లితండ్రులతో కలెక్టర్ మాట్లాడి దత్తత తీసుకొన్న బాలికను బాగా చదివించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం విశ్వజ, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సిహెచ్ అవంతి, ప్రభుత్వ బాలికల సదనం సూపరింటెండెంట్ ఎం కల్యాణి, ఇంచార్జి డిసిపివో ఎస్ ప్రవీణ్ కుమార్, సోషల్ వర్కర్ సంగి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.