హనుమకొండ(రైట్స్ మీడియా): గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ పరిధిలోని వంగపహడ్ పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్‌గా అనిల్ రెడ్డి నియమితులైన సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హనుమకొండలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి గారితో పాటు పీఏసీఎస్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. నూతనంగా చైర్మన్‌గా నియమితులైన అనిల్ రెడ్డి తో పాటు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శాలువాతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమానికి, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం పీఏసీఎస్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ని శాలువాలతో సత్కరించి తమ అభిమానం, గౌరవాన్ని చాటుకున్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
జిల్లా వార్తలు
వంగపహడ్ పీఏసీఎస్ చైర్మన్‌గా అనిల్ రెడ్డి నియామకం...
News URL: https://rightsmedia.in/news/anil-reddy-appointed-as-chairman-of-vangapahad-pacs
నూతన చైర్మన్‌ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ అధ్యక్షులు పుట్ట తిరుపతి, డివిజన్ ఉప అధ్యక్షులు రవీందర్, మాజీ చైర్మెన్ మెరుగు రాజేష్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు రాజు, పీఏసీఎస్ కమిటీ సభ్యులు గండు అశోక్,ఎంజాపురి రాములు, కొండ రాజు, సముద్రాల సూర్యనారాయ, కోరె సరోజన, మేరగుట్టి సూరయ్య, మేరుగు రాధిక, పొన్నాల రాధ, పోలాది రామ్ రెడ్డి, కన్నెబోయిన రాజు, బండి శంకరయ్య, రేమిడి సాంబ రెడ్డి, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.