సాధారణంగా రాఖీ పండగ అంటే అన్నాచెల్లె అనుబంధానికి ప్రతీక. కానీ వరంగల్ జిల్లా నర్సంపేట మండల కేంద్రంలో ఈ పండుగకు ఒక అంతర్జాతీయ ఖ్యాతి వనప్రేమి కొత్త భాష్యం చెప్పారు. ఆయనే మన ప్రేమి అవార్డు జాతీయ అంతర్జాతీయ గ్రహీత గోక రామస్వామి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, యూనిస్కో అవార్డు, శాంతి దూత అవార్డు, భారతీయ శిక్ష శ్రేష్ట అవార్డు మదర్ తెరిసా అవార్డు, రాష్ట్ర ఉత్తమ పౌరుడు, జ్యోతిరావు పూలే అవార్డు, పర్యావరణ మిత్ర ,వశిష్ట ఆచార్య పురస్కారం, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వంటి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న గోకరామస్వామి చెట్టును తన చెల్లిగా భావించి దానికి రాఖీ కట్టి 'వృక్షాబంధన్' అనే వినూత్న సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
వినూత్నంగా రాఖీ పండుగ : వృక్షానికి రాఖీ కట్టిన వనప్రేమి
“చెట్టే నా చెల్లి” అంటున్న అవార్డుల సరస్వతీ పుత్రుడు:
“చెట్టు మనకి కర్రనిస్తుంది, ప్రాణవాయువు (ఆక్సిజన్) ఇస్తుంది, ఎండలో నీడనిస్తుంది. తిరిగి మన నుండి ఏమీ ఆశించదు. అలాంటి చెట్టును మనం కాపాడుకోవద్దా?.. చెల్లి తన అన్న రక్షణ కోసం రాఖీ కట్టినట్లు, మనం కూడా వృక్ష రక్షణ కోసం రాఖీ కట్టాలి” అని అవార్డు గ్రహీత గోకా రామస్వామి పేర్కొన్నారు.
ఇది ఒక్కరోజు ఆలోచన కాదు. గత ఐదు సంవత్సరాలుగా* ప్రతి రాఖీ పండుగ రోజున నర్సంపేటలోని చెట్లకు రాఖీలు కట్టడం, వాటిని ఆలింగనం చేసుకోవడం ఆయన ఆనవాయితీగా పెట్టుకున్నారు. చెట్టును కేవలం మొక్కగా కాకుండా, తన కుటుంబ సభ్యురాలిగా భావించి ఆత్మీయ బంధాన్ని పంచుతున్నారు.
అవార్డుల వెనుక ఉన్న సందేశం
అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన వ్యక్తి ఇలా చెట్టుకు రాఖీ కట్టడం వెనుక పెద్ద సందేశం ఉంది. “చెల్లిని ఏ విధంగా ఆదరిస్తామో, మొక్కలను కూడా అదే విధంగా ఆదరించాలి. ఇది ప్రతి ఒక్కరూ సాంప్రదాయబద్ధంగా తమ అన్నా చెల్లెళ్ల సంస్కారాన్ని ఏర్పరుచుకోవాలి. చెట్టును నరకడం కాదు, చెట్టును కౌగిలించుకోవడం మన ధర్మం” అని ఆయన పిలుపునిచ్చారు.
ఒకవైపు విచ్చలవిడిగా చెట్లను నరుకుతున్న ఈ రోజుల్లో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఒక వనప్రేమి చెట్టుకు రాఖీ కట్టి దాని రక్షణ బాధ్యతను తీసుకోవడం నిజంగా హర్షణీయం. నర్సంపేట నుండి మొదలైన ఈ ‘వృక్షా బంధన్’ సంప్రదాయం దేశమంతా స్ఫూర్తిగా మారలని గోక రామస్వామి ఆకాంక్షించారు.