తిమ్మాజిపేట ఎస్ఐపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ స్పష్టంచేసారు. ఎస్ఐ ఎలాంటి తప్పు చేయలేదని తేల్చిచెప్పారు. ఎస్ఐ మూత్ర విసర్జన చేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. ఆరోపణలకు సంబంధించి ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవని విచారణ అధికారి సీఐ అశోక్ రెడ్డి అన్నారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసారు. కావాలనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు.
ఘటనపై ఎస్ఐతో పాటు విచారణ అధికారి సీఐ అశోక్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని డీఎస్పీ హెచ్చరించారు. అసత్యాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తే సంబంధిత యూట్యూబ్ ఛానెళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
తిమ్మాజిపేట ఎస్ఐపై ఆరోపణలు అవాస్తవం: డీఎస్పీ బుర్రి శ్రీనివాస్
News URL: https://rightsmedia.in/news/allegations-against-thimmajipet-si-are-baseless-dsp-burri-srinivas