ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్ను మూసారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కృష్ణా జిల్లా, కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు, 1976 లో వచ్చిన అంతులేని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. దాదాపు సినిమాలలో పైగా నటించారు. పలు టి.వి.సీరియళ్లలో కూడా నటించారు. మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు. రజనీకాంత్,చిరంజీవి కి నారాయణరావు మంచి మిత్రులు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ , చిలకమ్మ చెప్పింది , గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాల్లో నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ , యముడికి మొగుడు, పెళ్ళినీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. నారాయణ రావు చివరి చిత్రం "ఆలోచన"
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
నటుడు నారాయణ రావు మృతి
News URL: https://rightsmedia.in/news/actor-narayana-rao-passes-away