ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ టి. వెంకన్న శానిటేషన్ అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సంబంధ అంశాల పురోగతి పై శానిటరీ సూపర్ వైజర్ లు,శానిటేషన్ ఇన్స్పెక్టర్ లతో క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో కమిషనర్ పాల్గొని సమర్థవంతం గా చేపట్టుటకు తగు సూచనలు చేశారు.
ట్రేడ్ లైసెన్స్ వసూళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ..
శానిటేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం శానిటరీ సూపర్ వైజర్ లు,శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో నిర్విరామ గా విధులు చేపట్టాలని నగరంలోని ప్రధాన రహదారుల వెంట గల డివైడర్ ల పక్కన పేరుకు పోయిన మట్టి చెత్తా చెదారంను ఎప్పటికప్పుడు తొలగించాలని నగర సుందరీకరణ కు పాటు పడాలని, స్వీపింగ్ యంత్రాలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో క్లీనింగ్ ప్రక్రియ జరిగేలా శానిటేషన్ అధికారులు పర్యవేక్షణ చేయాలని, నిబంధనల మేరకు ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల చేపట్టాలని అన్ని అసెస్మెంట్ లను గుర్తించి, ఆయా ప్రాపర్టీలకు చెందిన ప్లింత్ ఏరియా ప్రకారం సవరించి వసూళ్లు జరిగేలా చూడాలని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కు సంబంధించి యూజర్ ఛార్జీల అంచనాలు తయారు చేసి, వసూళ్లు చేపట్టాలని అన్నారు. శానిటేషన్ పురోగతిని మరో 15 రోజుల తర్వాత సమీక్షించడం జరుగుతుందని ఆప్పటిలోగా శానిటేషన్ అంశం లో పురోగతి కనిపించాలని లేకుంటే చర్యలు తప్పవని కమిషనర్ అన్నారు.
ఈ సమీక్ష సమావేశం లో ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజారెడ్డి, ఆరోగ్యాధికారి డా.రాజేష్, శానిటరీ సూపర్ వైజర్ లు భాస్కర్, నరేందర్, గోల్కొండ శ్రీను, శానిటరీ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.