చెరువులు, నాలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి అన్నారు.
శుక్రవారం ఖిలా వరంగల్ లోని గుండు చెరువు వద్ద ఉన్న ప్రాంగణంలో వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు సంబంధించి వివిధ శాఖలతో ఏర్పాటైన చెరువుల పరిరక్షణ కమిటీ(లేక్ ప్రొటెక్షన్ కమిటీ) సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించిన చెరువులు, కుంటలు, నాలాల విస్తీర్ణం, ప్రస్తుతం ఉన్న స్థితి, పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి సాగునీటిపారుదల, రెవెన్యూ, కుడా, సర్వే, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ ఛైర్ పర్సన్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు నోటిఫై చేయాలన్నారు. ఈ ప్రక్రియను సంబంధిత అధికారులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రతి నాలాకు సంబంధించిన ఫీల్డ్ రిపోర్టును ఇరిగేషన్ అధికారులు అందజేయాలన్నారు. చెరువులు, కుంటలకు సంబంధించి ఎఫ్ టి ఎల్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఫీల్డ్ రిపోర్ట్ ఎంతో ముఖ్యమని అన్నారు. చెరువులు కుంటలు ఆక్రమణల గురికాకుండా క్షేత్రస్థాయిలో మార్కింగ్ చేయాలని అధికారులకు సూచించారు. చెరువు శిఖాలు ఆక్రమణ గురికాకుండా మార్కింగ్ చేసి వాటి పరిరక్షణ కు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నాలా కన్వర్షన్ చేసేటప్పుడు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ బి నిఖిత, కుడా సీపీవో అజిత్ రెడ్డి, డిఆర్వో విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీవో సుమ, భూములు కొలతలు శాఖ ఏడీ నూర్ సింగ్, సాగునీటిపారుదల శాఖ ఈఈలు మంగీ లాల్, కిరణ్ కుమార్, కుడా ఈఈ భీమ్ రావు, సీపీవో రవీంద్ర రాడేకర్, ఖిలా వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.