నల్లగొండ జిల్లా - మిర్యాలగూడ లో సంచలనం సృష్టించిన.. "ప్రణయ్" హత్యకేసులో ఏ4 గా శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందాడు. చర్లపల్లి జైలులో వున్నబారీ గుండె నొప్పితో అస్వస్థతకు గురైయాడు. వెంటనే జైలు సిబ్బంది బారీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బారీ మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో మృతదేహం వుంచారు. నల్లగొండ ప్యారసభాగ్ కాలనీకి చెందిన అబ్దుల్ బారీ, గతంలో గుజారత్ మంత్రి హరేన్ పాండే హత్య కేసులోనూ జైలు శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం ఏ4 గా ప్రణయ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
ప్రణయ్ హత్యకేసులో నిందితుడు మృతి
News URL: https://rightsmedia.in/news/accused-in-pranay-murder-case-dies