నరసరావుపేట (రైట్స్ మీడియా): మోసం, బంగారు ఆభరణాల దుర్వినియోగం, దొంగతనం కేసుల్లో నిందితుడిని నరసరావుపేట 1టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. Cr.No.24/2026, Cr.No.91/2026 కేసుల్లో నిందితుడు దోగిపర్తి విజయ్‌కుమార్ (30)ను అక్టోబర్ 4న SSN కాలేజీ సమీపంలో WSI అరుణ, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా పరిచయమున్న మహిళకు చెందిన బంగారు ఆభరణాలను తీసుకుని, వాటిలో కొంత భాగాన్ని గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రూ.11.85 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరో కేసులో స్నేహితుడి వద్ద ఉన్న సుమారు 74 గ్రాముల బంగారం, రూ.47 వేల నగదు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
బంగారు ఆభరణాల మోసం, దొంగతనం కేసుల్లో నిందితుడి అరెస్ట్
News URL: https://rightsmedia.in/news/accused-arrested-in-gold-jewelery-fraud-and-theft-cases
నిందితుడి వద్ద నుంచి 40.350 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రెండు కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన CI, SI, పోలీసు సిబ్బందిని DSP అభినందించారు.