RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
క్రైమ్ న్యూస్
విద్యుత్ షాక్తో రైతు భూక్యా శ్రీను మృతి..
News URL: https://rightsmedia.in/news/a-farmer-bhukya-srinu-dies-of-electric-shock
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఏనుగల్లు తండాకు చెందిన రైతు భూక్యా శ్రీను విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.
స్థానికుల సమాచారం ప్రకారం, వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న సమయంలో విద్యు త్ ట్రాన్స్ఫారం వద్ద ఫీజు పెట్టాలని వెళ్లగా విద్యుత్ షాక్ తగలడంతో రైతు అక్కడిక్కడే మృతి చెందినట్లు రైతులు తెలిపారు . ఈ ఘటనపై నర్సంపేట ఆర్సీ ఇంచార్జి(రైట్స్ మీడియా) వల్లే రమేష్ లైన్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడగా రైతు విద్యుత్ సమస్యపై మాకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు మేము సంఘటన స్థలానికి వెళ్లేలోపే రైతు విద్యుత్ షాక్ గురై చనిపోయినట్లు లైన్ ఇన్స్పెక్టర్ తెలియజేయడం జరిగింది. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.