నారాయణఖేడ్ పట్టణంలో ఆధునికంగా ఏర్పాటుచేసిన బాలాజీ అనురాధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ స్థానిక శాసనసభ్యులు డా. సంజీవరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను మంత్రి పరిశీలించారు. నారాయణఖేడ్ ప్రాంత ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఆసుపత్రి నిర్వాహకులను మంత్రి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య చికిత్సలకు సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రజా వైద్య, ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న సేవలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ హరిణి, ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ పట్లోళ్ల అనురాగ్ రెడ్డి, డాక్టర్ కే శ్రీధర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
RIGHTS MEDIA SOCIETY
Powering Truth, Defending Rights
తెలంగాణ
జిల్లా కేంద్రాల్లోనే 90 శాతం వైద్య చికిత్సలు
నారాయణఖేడ్ లో బాలాజీ అనురాధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.
News URL: https://rightsmedia.in/news/90-of-medical-treatments-take-place-at-district-headquarters