నిజామాబాద్ (రైట్స్ మీడియా): నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమానా విధించింది... బూసా జనార్ధన్ అలియాస్ గొల్ల జనార్ధన్ అలియాస్ తొంటి జనార్ధన్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణపల్లి నివాసి. నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడినట్లు నమోదైన కేసులో నిందితుడిగా ఉన్నాడు.
మావోయిస్ట్ కార్యకలాపాల కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష...
ఈ ఘటనకు సంబంధించి 2022 సంవత్సరంలో జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహించిన K. శ్రీకాంత్ నిందితుడిని చాకచక్యంగా పట్టుకోని, అతనిపై జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తును నిజామాబాద్ డివిజన్ ఏసీపీలుగా విధులు నిర్వర్తించిన ఏ వెంకటేశ్వర్ ఎం కిరణ్ కుమార్ ఎల్ రాజ వెంకటరెడ్డి లు కొనసాగించి, సమగ్ర దర్యాప్తు అనంతరం న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి డి..దుర్గ ప్రసాద్, నాల్గవ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి (మహిళా కోర్టు), నిజామాబాద్ అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఐదు వేల రూపాయల జరిమానా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసు దర్యాప్తు మరియు విచారణలో ముఖ్యపాత్ర పోషించిన ఏసీపీలు ఏ వెంకటేశ్వర్, ఎం కిరణ్ కుమార్, రాజా వెంకటరెడ్డి, జి నరేందర్, ఎస్సై K. శ్రీకాంత్, ఎస్సైలను, అలాగే కేసు విచారణలో సాక్షులను సకాలంలో న్యాయస్థానం ముందు హాజరుపరిచి ప్రాసిక్యూషన్కు సహకరించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం నీరజ, ఎస్సై జి. మహేష్, జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ టి గోవింద్, కోర్టు లైజన్ అధికారి K. చంద్రశేఖర్, కే గణేష్ ఈ కిషోర్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.